Thursday, 20 May 2021

బాలయ్య బాబుతో రొమాన్స్‌కి రెడీ అనేసిన త్రిష! అంతా పక్కాగా ప్లాన్ చేసిన మాస్ డైరెక్టర్

నందమూరి నటసింహం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోగా యమ దూకుడుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్న ఆయన, తన తదుపరి సినిమా కోసం మరో మాస్ దర్శకుడిని లైన్‌లో పెట్టారు. 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండనుందని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయమై పలువురి పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు త్రిషను ఓకే చేశారట. ఇటీవలే రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాతో మాస్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన ఈ సారి మరింత పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన ఈ భారీ సినిమా కోసం నటీనటులను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ త్రిషపై ఆయన కన్ను పడిందని, వెంటనే ఆమెతో సంప్రదింపులు జరపగా ఓకే అనేసిందని తెలుస్తోంది. దీంతో బాలయ్య బాబు- కాంబోలో రాబోతున్న సన్నివేశాల కోసం పక్కాగా ప్లాన్ చేసి థియేటర్లలో నందమూరి అభిమానుల చేత గోల పెట్టించాలని చూస్తున్నారట డైరెక్టర్ గోపీచంద్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, అందుకోసం బాలీవుడ్ తారల వైపు చూస్తున్నారని టాక్. గతంలో 'లయన్' సినిమాలో బాలయ్యతో ఆడిపాడింది త్రిష. ప్రస్తుతం బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తున్న BB3 షూటింగ్ ఫినిష్ కాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bEzLLa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...