Tuesday, 4 May 2021

అందాల భామలకు దెయ్యాల పేర్లు..! సుధీర్ వర్మ ఏం చేసినా వెరైటీనే

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారంటే దానిపై ఫ్యాన్స్‌కి ఉండే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. మరి ఇద్దరు టాప్ హీరోయిన్లు కలిసి ఓ ఒకే సినిమా చేస్తే. ఇక అది అభిమానులకు డబుల్ ధమాకానే. త్వరలో అలాంటి సినిమానే ప్రేక్షకుల ముందకు రానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్ర, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా ఓ మల్టీస్టారర్ త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. తొలుత కాస్త పద్దతిగా కనిపించినా.. ఆ తర్వాత ప్రేక్షకులకు అందాల విందు ఇచ్చింది. అయితే ఈ భామకి గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా పోయింది. ఇక జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ.. ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌‌గా దూసుకుపోతుంది నివేదా. ఆమె కొంతకాలం క్రితం రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమాలో, లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించింది. ఇక రెజీనా తన కెరీర్‌లో తొలిసారిగా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో స్పెషల్ పాటకి చిందులు వేసిన ఆమె.. అలాంటి పాట చేయడం అదే చివరి సారి అని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు బ్యూటీలు కలిసి ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ హిట్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ సినిమాలో వీళ్లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు సుధీర్మ వర్మ ఓ డిఫరెంట్ టైటిల్‌ని ఫిక్స్ చేశాడట. ఈ సినిమాకి ‘శాకినీ-ఢాకినీ’ అంటే దెయ్యాల పేర్లతో ఫన్నీ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h1DiXh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...