Wednesday, 19 May 2021

సుడిగాలి సుధీర్ ఓ 'గాలోడు'.. మాసిన గెడ్డం, నోట్లో సిగరెట్! సడెన్ షాకిచ్చిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కమెడియన్ గురించి ఎంత చెప్పినా తక్కువే లెండి. బుల్లితెరపై రాణిస్తూ కూడా స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ సంపాదించవచ్చు అని నిరూపించాడు సుధీర్. తనదైన కామెడీ టైమింగ్ డైలాగులతో ఆకట్టుకునే ఈ కుర్రోడు చిన్ని తెరపై చేసే అల్లరి చేష్టలు అన్నీఇన్నీ కావు. హోస్ట్‌గా, కమెడియన్‌గా అంతకుమించి బుల్లితెర లవర్ బాయ్‌గా భారీ క్రేజ్ సంపాదించిన సుధీర్.. తాజాగా డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించి సడెన్ షాకిచ్చాడు. బుల్లితెరపై హవా నడిపిస్తున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి ఆకట్టుకున్న ఈయన.. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఆ మధ్య 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఆ తర్వాత 'త్రీమంకీస్' మూవీ చేశాడు. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని మరోసారి రంగంలోకి దిగుతున్నాడు ఈ జబర్దస్త్ కుర్రోడు. ఈ సారి '' అంటూ మాస్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకునేలా సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తున్నాడు. నేడు (మే 19) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ 'గాలోడు' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చెవికి పోగు పెట్టుకొని మాసిన గెడ్డంతో కనిపిస్తున్న సుధీర్.. నోట్లో సిగరెట్ వెలిగించి కనిపించాడు. ఈ లుక్ చూస్తుంటే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో పాటు '' అనే థ్రిల్లర్ మూవీ కూడా చేస్తున్నాడు సుధీర్. అరున్ విక్కిరాలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అతను సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నాడని సమాచారం. ఇందుకోసం సుధీర్ బాగానే వర్కవుట్స్ చేస్తున్నాడట. సో.. చూడాలి మరి ఈ సారైనా సుధీర్ హీరోగా సక్సెస్ పట్టేస్తాడా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f1N1LO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...