ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పోరాటంలో ఆయా రాష్ట్రాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. సెలెబ్రిటీలు ప్రభుత్వాలకు అండగా ఆర్ఠిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈక్రమంలో బాలీవుడ్, కోలీవుడ్‌లో సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, నిర్మాతలు అందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. కరోనాపై పోరాడేందుకు కోలీవుడ్ హీరోలు తమ వంతు సాయమందిస్తున్నారు. సూర్య, కార్తీ, శివ కుమార్ ఇలా ఫ్యామిలీ అంతా కలిసి స్టాలిన్‌ను కలిసి విరాళాన్ని అందించారు. సూపర్ స్టార్ నుంచి అజిత్ వరకు అందరూ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో శివ కార్తికేయన్ 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ పది కోట్ల రూపాయాలను సాయంగా అందించారు. ఇక తాజాగా రజినీకాంత్ యాభై లక్షల రూపాయాలను ప్రకటించారు. చియాన్ సైతం తాజాగా ఈ కార్యక్రమంలో తన వంతు ఆర్థిక సాయంగా అందించారు. 30 లక్షల రూపాయాలను సీఎం సహాయనిధికి విరాళాన్ని అందించారు. తమిళనాడులో కరోనా కేసులు ఎంతగా పెరిగిపోతోన్నాయో అందరికీ తెలిసిందే. ఆ రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇప్పటికే లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక గత ఏడాది టాలీవుడ్ సైతం విరాళాలను సేకరించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి, సినీ పరిశ్రమ కార్మికుల కోసం టాలీవుడ్ హీరోలందరూ ముందుకు వచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3onTl3w
v
No comments:
Post a Comment