Monday, 3 May 2021

వేరే అమ్మాయిలతో ఎఫైర్స్‌.. డైరెక్ట్‌గా ఇంటికే తీసుకొచ్చేవాడు.. నటుడిపై అతని భార్య పోలీస్ కంప్లైంట్

తెలుగు టీవీ సీరియల్ యాక్టర్ రాజేష్‌ దత్తాపై ఆయన భార్య పోలీస్ కేసు పెట్టింది. తాను ఉండగానే వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని హింసిస్తున్నాడని పేర్కొంటూ అతడి భార్య అరుణ అలియాస్‌ సాధన పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశం అయింది. పెళ్లి కాలేదని చెప్పి ఇతర అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకుంటున్నాడంటూ ఆమె ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 2015 సంవత్సరం జూన్‌ 6వ తేదీన సీరియల్‌ నటుడు రాజేష్‌ దత్తాతో విజయవాడలో చాలా గ్రాండ్‌గా తమ పెళ్లి జరిగిందని, 15లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చి తన తల్లిదండ్రులు పెళ్లి చేశారని ఆమె చెప్పింది. పెళ్లి తర్వాత 3 నెలల పాటు హైదరాబాద్ గాజులరామారం లోని రాజేష్ ఇంట్లోనే ఉన్నామని.. ఆ తర్వాత తనను చెన్నైలో ఉంచి ఆయన మాత్రం షూటింగ్స్ అంటూ హైదరాబాద్ వచ్చేవాడిని చెప్పింది. ఈ క్రమంలోనే వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ స్టార్ చేశాడని చెబుతూ ఆవేదన చెందింది సాధన. పెళ్లి కాలేదని అబద్దాలు చెప్పి అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకునేవాడని, అంతేకాకుండా ఆ అమ్మాయిలను డైరెక్ట్‌గా ఇంటికే తీసుకొచ్చేవాడని వాపోయింది. ఇదేంటని ప్రశ్నిస్తే తనను ఇంట్లోంచి గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా ఇష్టం. నేను ఎవరితోనైనా తిరుగుతాను, నీ ఇష్టమొచ్చింది చేసుకోపో అనేవాడని ఆమె తెలిపింది. దీంతో రాజేష్‌ దత్తా ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. , చంద్రలేఖ సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్న రాజేష్.. గతంలో కర్తవ్యం, సుందరకాండ, మొగలి రేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, చంద్రలేఖ సీరియల్స్‌ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ueoM2m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...