Sunday, 16 May 2021

దానిపై నేను మనస్సు పడ్డాను.. ఎప్పటికీ అదే నా ఫేవరేట్.. సమంతా లేటెస్ట్ కామెంట్స్

తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేసే హీరోయిన్లలో సమంతా ముందు వరుసలో ఉంటుంది. తొలి సినిమా నుంచే ఆమె ఎన్నో ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌లను సృష్టించింది. ‘ఏం మాయ చేశావే’ సినిమాలో ధరించి లైట్ రంగు చీరలు అప్పట్లో ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సమంత ధరించి డ్రెస్‌లు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి. అంతేకాక.. పలు ఈవెంట్‌లలో, ఫంక్షన్లలో సమంత డ్రెస్సింగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే సమంత ఓ వస్తువుపై మనస్సు పడిందట. అది మరేదో కాదు.. లూయి విట్టోన్‌ బ్యాగ్‌. ప్రపంచ ప్రసిద్ధగాంచిన ఫ్యాషన్ సంస్థల్లో లూయి విట్టోన్‌ ఒకటి. చాలా మంది సెలబ్రిటీలు ఈ సంస్థకు సంబంధించిన వస్తువులను వాడుతుంటారు. లూయి విట్టోన్‌కి చెందిన బ్యాగ్ కొనుక్కొవాలని ఆశపడినట్లు సమంత ఈ మధ్య పేర్కొంది. ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు లూయి విట్టోన్‌ బ్యాగ్‌ కొనుక్కోవాలని మనసుపడ్డాను. ఆ బుజ్జి బ్యాగ్‌ ధర ఎంతో తెలుసా? 30 థౌజెండ్‌ రూపీస్‌ ఓన్లీ. ఆ కాలాన్ని ఫాస్ట్‌ఫార్వడ్‌ చేస్తే అది ఇప్పటికీ నా ఫేవరేట్‌’’ అని సమంత పేర్కొంది. సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తుంది. బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాయ్‌పేయి, ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే సినిమాలో లేడీ విలన్‌ పాత్రలో సమంత కనిపించనుంది. దీంతో పాటు గుణశేఖర్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘శాకుంతలం’ అనే సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో పోషిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hy5yBc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...