Thursday, 20 May 2021

ప్రియమైన కరోనా అంటూ.. బుల్లి రష్మిక మందన్నా పిక్ వైరల్

ఛలో బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్న రష్మిక.. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. వరుసగా ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతానికైతే రష్మిక హైద్రాబాద్‌లోనే ఉంటున్నారు. పుష్ప సినిమా కోసం వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయారు. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్‌లన్నీ కూడా అటకెక్కినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా మరీ తీవ్రతరంగా మారింది. సెలెబ్రిటీలందరూ కరోనా బారిన పడుతున్నారు. మొన్నీ మధ్యే అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. అలా ఇండస్ట్రీలో కరోనా ఇప్పుడు స్వైర విహారం చేస్తోంది. ఇక దేశంలో రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత ఏడాది కంటే ఇప్పుడు మరింత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కరోనా ఎప్పుడు పోతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. రష్మిక కూడా అదే ఫీలింగ్‌లో ఉన్నారు. ఆ విషయాన్ని చెప్పేందుకు రష్మిక తన చిన్న నాటి ఫోటోను ఉపయోగించుకున్నారు. రష్మిక తన బాల్యంలోని ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ కరోనా మీద తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రియమైన కరోనా నువ్ ఈ ప్రపంచం నుంచి ఎప్పుడు వెళ్తావో అని ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చారు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. గుడ్ బై, మిషన్ మజ్నులతో బాలీవుడ్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నారు. ఇక తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే రెండు ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/344G9qI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...