Thursday, 20 May 2021

ఒక్క చాన్స్ ఇస్తావా?..రేయ్ ఏంటిరా ఇది అంటూ సురేఖా వాణి వెరైటీ రియాక్షన్

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. గతేడాది లాక్డౌన్ సమయం నుంచి సురేఖా వాణికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. అంతకు ముందు సినిమాల ద్వారా కేవలం వెండితెరపైనే కనిపిస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఎక్కువగా హల్చల్ చేస్తున్నారు. అలా సురేఖా వాణికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొన్నీ మధ్యే సురేఖా వాణి నాలుగు పదుల వయసులోకి అడుగుపట్టేశారు. 40వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంతగా రచ్చ చేశాయో అందరికీ తెలిసిందే. అలా సురేఖా వాణి గ్లామర్, ఫిట్ నెస్‌పై రకరకాల మీమ్స్ వస్తుంటాయి. అందరూ కూడా ఈ వయసులోని సురేఖా వాణి గ్లామర్‌కు ఫిదా అవుతుంటారు. తన కూతురు సుప్రిత కంటే సురేఖా వాణినే అందరూ పొగుడుతూ ఉంటారు. అందం విషయంలో తన కూతురిని కూడా డామినేట్ చేస్తుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. పార్టీలకు వెళ్లినా, గోవా బీచ్‌లో తిరిగినా, బాత్ టబ్‌లో షాంపైన్ బాటిల్‌తో కనిపించినా సురేఖా వాణి తన ముద్రను వేసేశారు. అలా సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ హాట్ టాపిక్ అవుతుంటారు. ఇక ఆమె రెండో పెళ్లి విషయంలో ఇప్పటికే లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. రెండో పెళ్లిపై వచ్చిన రూమర్లు, వాటిపై వచ్చిన మీమ్స్, అంకుల్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిపోయింది. తాజాగా సురేఖా వాణి అందాన్ని చూసి ఒక్క చాన్స్ అంటూ మిర్చి స్టైల్లో ప్రభాస్‌లా అంకుల్స్ అందరూ అడుగుతున్నట్టు ఓ మీమ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై సురేఖా వాణి వెరైటీగా రియాక్ట్ అయ్యారు. రేయ్ ఏంటి రా ఇది అంటూ తల పట్టుకున్నారు. మొత్తానికి సురేఖా వాణి గ్లామర్, ఫిట్ నెస్ మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T9fpDD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...