Friday, 14 May 2021

సినీ పరిశ్రమలో మరో విషాదం.. పవన్‌కళ్యాణ్ హీరోయిన్ తండ్రి కన్నుమూత

గత కొంతకాలంగా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు కరోనా మహమ్మారి బారిన పడి తుదిశ్వాస విడుస్తుండగా.. మరికొందరు అనారోగ్యం కారణంగా కాలం చేస్తున్నారు. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘’ హీరోయిన్ తండ్రి కేశ్‌పల్లి (గడ్డం) ఆనందరెడ్డి మృతి చెందారు. గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో చేరిన ఆయన కొంత సమయానికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీ కృష్ణరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గన్‌షాట్’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తీ రెడ్డి.. తొలిప్రేమ సినిమాతో మంచి గుర్తింపు సాధించింది. తెలుగుతో పాటు ఆమె పలు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్’ అనే సినిమాలో ఆమె చివరిసారిగా నటించింది. ఈ సినిమాకిగాను ఆమె ఉత్తమ సహాయనటిగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు కూడా అందుకుంది. అయితే కీర్తీ రెడ్డి తండ్రి అనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ గంగారెడ్డి తనయుడు. తొలుత యూత్ లీడర్‌గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే హీరో సుమంత్‌తో విడాకుల తర్వాత బెంగళూరులో స్థిరపడ్డ కీర్తీ.. ప్రస్తుతం తండ్రి మరణ వార్త విని హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bn63du
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...