Friday, 21 May 2021

Anchor Ravi: పెళ్లయ్యాక నీ భర్త కూడా ఇదే చేస్తాడు.. తప్పదు! వర్షిణికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రవి

ప్రస్తుతం లాక్‌ డౌన్ కావడంతో సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో హవా నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తమ తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఓ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మరో యాంకర్ దానిపై కామెంట్ చేయడంతో ఆమెకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు రవి. కెమెరా ముందు ఎంత చలాకీగా ఉంటాడో ఇంట్లోనూ అంతే హుషారుగా ఉండే యాంకర్ రవి.. వకీల్ సాబ్ సినిమాలోని 'మగువా మగువా' అనే పాట స్ఫూప్‌కు ఓ రీల్ వీడియో చేశాడు. పురుషా పురుషా అంటూ వచ్చిన పేరడి పాటకు రవి ఓ రీల్ వీడియో చేశాడు. ఇందులో ఇంట్లోని పనులు మొత్తం తానే చేస్తున్నట్లు చూపించాడు. ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో తోటి యాంకర్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ వర్షిణి 'అయ్యో మా రవన్నా ఏంటి ఇలా అయిపోయావ్? కానీ మస్త్ ఉంది చూడడానికి' అంటూ ఓ కామెంట్ వదిలింది. దీంతో ఆమెకు మద్దతుగా ఎంతో మంది రిప్లైలు ఇస్తున్నారు. ఇది చూసిన యాంకర్ రవి.. తనదైన శైలిలో ఓ పంచ్ విసిరాడు. ''వర్షిణి.. సమాజంలో ప్రతి మగాడి పరిస్థితి ఇంతే కదా. రేపు పెళ్లి తర్వాత నీ మొగుడు కూడా ఇదే చేయాలి. నువ్వు చేయిస్తావు కూడా' అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. దీంతో వీళ్లిద్దరి సంభాషణపై నెటిజన్స్ తమదైన కోణంలో రియాక్ట్ అవుతున్నారు. కాగా రవి ఈ రేంజ్ బిల్డప్‌లు చూసి ఆయన భార్య నిత్య సెటైర్లు వేసింది. మేకింగ్ వీడియో బయటపెట్టనా? అసలు జరిగిందేంటో వీడియో బయటపెట్టమంటావా? అని రవిని నిత్య బెదిరించడం కొసమెరుపు. ఏదేమైనా ఇంట్లో ఉండి కూడా యాంకర్ రవి ఇలా ఎంటర్‌టైన్ చేస్తుండటం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hIRxRw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...