Sunday, 2 May 2021

అల్లు అర్జున్ 21 ఫిక్స్.. లైన్ లోకి ఆ దర్శకుడు! బన్నీ ఫ్యాన్స్ ఊగిపోయేలా పక్కా స్కెచ్..

అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్‌‌లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లో ఆయన్ను చూపించబోతున్నారు సుక్కు. ఈ మూవీలో బన్నీతో కలిసి స్టెప్పులేస్తోంది రష్మిక మందన. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ కావడంతో బన్నీ తర్వాతి ప్రాజెక్టు ఎవరితో అనే దానిపై అందరి చూపు పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. 'పుష్ప' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమాను కన్ఫర్మ్ చేశారు. కెరీర్‌లోనే ఎన్నటికీ గుర్తుండిపోయేలా ఆయన కోసం కొరటాల ప్రత్యేకంగా బలమైన కథ రెడీ చేశారని టాక్ నడిచింది. ఇంతలో ఆ ప్రాజెక్టు విషయంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు కొరటాల శివ. ఈ మేరకు ఇటీవలే అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. దీంతో మరి అల్లు అర్జున్ 21వ సినిమా సంగతేంటి? అది ఎవరితో ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు బన్నీ 21వ సినిమా దర్శకత్వంలో ఉండనుందని తెలుస్తోంది. గీతాఆర్ట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని, ఇందుకోసం డైరెక్టర్ మురుగదాస్‌ భారీ స్కెచ్ వేసి పాన్ ఇండియా స్టోరీ సిద్ధం చేస్తున్నారని టాక్ మొదలైంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట. నిజానికి బన్నీ 21 కోసం ప్రశాంత్ నీల్ సహా చాలామంది దర్శకులు పోటీపడ్డారు కానీ ఆ అవకాశం మురుగదాస్‌‌కే దక్కిందని అంటున్నారు. దీనిపై అతిత్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xHZYSr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...