Friday, 28 May 2021

20 రోజుల్లో పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసేయ్!.. నెటిజన్ సలహాపై ప్రశాంత్ వర్మ కౌంటర్

ప్రస్తుతం చేతిలో ఎన్ని సినిమాలున్నాయో అందరికీ తెలిసిందే. అవి ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇంకా ఎంతో మంది దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. అన్నీ సవ్యంగా ఉండి ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ రాకపోతే.. లాక్డౌన్ లేకపోతే ఈ పాటికే పవన్ కళ్యాణ్ మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. మళయాళీ రీమేక్, క్రిష్ సినిమా, హరీశ్ శంకర్ ప్రాజెక్ట్, బండ్ల గణేష్‌కు మరో సినిమా అంటూ ఇలా పవన్ కళ్యాణ్ తన సినిమాలను వరుస పెట్టి ఉంచారు. అలా పవన్ కళ్యాణ్ ఇంత బిజీగా ఉంటే.. ఓ నెటిజన్ మరో ప్రాజెక్ట్ చేయమని డైరెక్టర్‌కు సలహా ఇచ్చాడు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసే ప్రతీ సినిమాలో కొత్తదనం ఉండేలా.. విభిన్నంగా ఉండేలా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. అ!, కల్కి, జాంబీరెడ్డి వేటికవే ప్రత్యేకమైన చిత్రాలు. ఫలితాలు ఎలా ఉన్నా కూడా గుర్తింపు మాత్రం వచ్చింది. అలా ప్రశాంత్ వర్మ తన నాల్గో సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ కాన్సెప్ట్, జానర్ ఏంటో గెస్ చేయండని నెటిజన్లకు సవాల్ విసిరారు. అయితే ఈ పోస్టర్ మీద నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఓ నెటిజన్ వెరైటీగా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో 20 రోజుల్లో పూర్తయ్యే సినిమా ఏదైనా ఒకటి తీసేయ్ అన్నా అని సలహా ఇచ్చారు. దానికి స్పందించిన ప్రశాంత్ వర్మ.. సదరు నెటిజన్‌కు కౌంటర్ వేశారు. 20 రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు తమ్ముడు అంటూ అసలు విషయం చెప్పారు. మొత్తానికి ప్రశాంత్ వర్మ మళ్లీ ఓ కొత్త జానర్‌లో సినిమా చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34qGa8O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...