Tuesday, 11 May 2021

పవన్ కళ్యాణ్‌కి 100 ముద్దులు.. చిరంజీవిని చూడగానే ఏడ్చేశా! సీక్రెట్స్ బయటపెట్టిన సురేఖా వాణి

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం . ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, అత్తగా తనదైన నటనతో ఆకట్టుకున్న ఆమె సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం సురేఖ హ్యబీ. ఈ నేపథ్యంలో తాజాగా '' మాట్లాడుతూ తన లైఫ్, కెరీర్‌లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది సురేఖా వాణి. గత కొన్నేళ్లుగా 'ఆలీతో సరదాగా' ప్రోగ్రాం ద్వారా తారలకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలుస్తున్నాయి. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీ.. గెస్టుల నుంచి కీలక సమాచారం రాబడుతుంటారు. అలా అలా సరదాగా సురేఖా వాణితో ముచ్చటిస్తూ టాపిక్ తీశారు ఆలీ. చిరంజీవి గారిని మొదటి చూడగానే మీరు ఏడ్చేశారట.. నిజమేనా? అని అడగడంతో అసలు విషయం బయటపెట్టింది సురేఖా వాణి. ''అదేంటో.. తెలియలే ఆయన్ను చూడాగానే పట పటా కన్నీళ్లు వచ్చేశాయి. నేనలా ఏడుస్తుంటే ఆయన నా దగ్గరకొచ్చి అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావ్. ఏడవకు.. ఏడవకు అని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకున్నారు. ఒక్కోసారి గుళ్లోకి వెళ్లినపుడు దేవుడిని చూస్తే ఏడుపొస్తుంది.. అలాగే చిరంజీవి గారిని చూస్తే కూడా నాకు ఏడుపొచ్చేసింది'' అని సురేఖా వాణి తెలిపింది. చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించానని, ఆ తర్వాత ఓ రోజు ఆయన పర్సనల్‌గా పిలిచి తనతో మాట్లాడారని ఆమె తెలిపింది. పెళ్లికి ముందే నారాయణ మూర్తి గారితో 'తెలుగోడు' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి బిడ్డ పుట్టాక మళ్లీ సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది సురేఖా వాణి. ఆలీ అడిగిన అన్ని ప్రశ్నలపై ఓపెన్‌గా మాట్లాడిన ఆమె.. 100 ముద్దులు ఇవ్వాలనుకునే హీరో ఎవరున్నారు? అనే ప్రశ్నపై పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. అలాగే తనకు కత్తిలా ఉంది అనిపించే హీరోయిన్ శ్రీదేవి అని సురేఖ చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tBvUop
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...