ప్రెసెంట్ టాలీవుడ్ లోకమంతా పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ మూవీపైనే కన్నేసింది. 'అజ్ఞాతవాసి'గా వెండితెరకు దూరమైన పవర్ స్టార్ 'వకీల్ సాబ్'గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆ క్షణం కోసం అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కావడంతో అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ వీడియోపై స్పందించిన పవన్ మాజీ భార్య తన మనసులో మాట బయటపెట్టింది. వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రేణు. ఇప్పటివరకూ చూడని పవర్ స్టార్ స్క్రీన్‌పై కనిపించాడని అనేసింది. అంతేకాదు.. ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ నచ్చిందని, అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన అదరగొట్టేశాడని పేర్కొంది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుందని.. మొదటి నుంచి చివరి వరకు 'వకీల్ సాబ్' ట్రైలర్ ఆసక్తికరంగా సాగిందని కితాబిచ్చింది రేణు. ఆమె స్పందన చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌గా ఈ 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rHxVhC
v
No comments:
Post a Comment