సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరినీ కుదిపేస్తున్నాయి. బాలీవుడ్‌లో వరుసగా సెలెబ్రిటీలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ నటుడు మృతిచెందారు. సినీ నటుడు ఇకలేరు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పొట్టి వీరయ్య కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. పొట్టి వీరయ్య సొంత జిల్లా నల్గొండ. అగ్గివీరుడు సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. రాధమ్మ పెళ్లి, తాతా మనవడు, టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ వంటి పలు చిత్రాల్లో పొట్టివీరయ్య వివిధ రకాల పాత్రల్లో నటించారు. ఇక ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ సారి వీరయ్య అనారోగ్య పరిస్థితి బాగా లేని సమయంలో రెండు లక్షల ఆర్థిక సాయాన్ని చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున చిరంజీవి చేసిన ఆర్థిక సాయాన్ని తలుచుకుని ఆనాడు పొట్టి వీరయ్య ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32LrMXR
v
No comments:
Post a Comment