Sunday, 25 April 2021

Oscar 2021.. ‘టెనెట్’ అలా ‘సోల్’ ఇలా.. హిస్టరీలో ఫస్ట్ టైం!

ప్రపంచ సినీ రంగంలోనే అవార్డులు అత్యుత్తమమైనవి. ఆస్కార్ అవార్డు సాధించాలనేది ప్రతీ ఒక్క నటుడి కల. అంతర్జాతీయ స్థాయి అకాడమీ అవార్డుల పోటీ జరుగుతుంది. ప్రతీ ఏటా ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని వేల చిత్రాలు బరిలోకి దిగుతాయి. మన దేశం నుంచి కూడా నామినేట్ అవుతాయి. కానీ చివరి వరకు నిలబడవు. అయితే కరోనా ప్రభావం చేత ఈ సారి వేడుకలను వెరైటీగా ప్లాన్ చేశారు. మామూలుగా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంటే ఉండే హంగామానే వేరు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అయితే కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ వీక్షించేందుకు వీలుగా లైవ్ ప్రసారాన్ని చేస్తున్నారు. అయితే భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం నుంచి ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని కేటగిరీల్లో విజేత ఎవరన్నది తెలిసిపోయింది. ఈక్రమంలో టెనెట్, చిత్రాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌లో సత్తా చాటింది. బెస్ట్ యానిమేటేడ్ చిత్రంగా సోల్ అవార్డును దక్కించుకుంది. మాంక్ చిత్రానికి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో అవార్డు లభించింది. ఉత్తమ నటుడిగా ఆంటోని హాప్‌కిన్స్‌కు (ది ఫాదర్) ఆస్కార్ లభించింది. అయితే అందరూ కూడా చాడ్విక్ బోస్‌మన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని ఊహించారు. ఇక ఆస్కార్ హిస్టరీలోనే క్లో జావ్(నో మ్యాడ్ లాండ్ దర్శకురాలు) సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఆసియా ఖండం నుంచి మొదటిసారిగా ఆస్కార్ అందుకున్న మహిళ దర్శకురాలిగా క్లో జావ్ కొత్త శకాన్ని లిఖించారు. కొరియా నుంచి ఉత్తమ సహాయకురాలి పాత్రకు గాను యు జంగ్ యోన్ అనే నటి ఆస్కార్‌ను అందుకున్నారు. మినారి చిత్రంలో ఈమె నటనకు ఆస్కార్ లభించింది. జుదాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య సినిమాలోని డేనియల్ కాలుయకు పర్ఫామెన్స్‌కు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ లభించింది. ఉత్తమ చిత్రంగా నోమ్యాడ్‌లాండ్, ఉత్తమ దర్శకుడిగా క్లో జావ్, ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్‌డర్మాండ్, సౌండ్ ఆఫ్ మెటల్ సినిమాకు గానూ మిక్కేల్ ఈ జీ నిల్సన్‌కు ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులు లభించాయి. సౌల్ చిత్రానికి ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) కేటగిరీలో, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో జుదాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్య సినిమాలోని ఫైట్ ఫర్ యూ పాటకు అవార్డు వచ్చింది. ఉత్తమ స్క్రీన్ ప్లే(అడాప్టెడ్) కేటగిరీలో ధి ఫాదర్ సినిమాకు, స్క్రీన్ ప్లే(ఒరిజినల్) కేటగిరీలో ప్రామిసింగ్ యంగ్ వుమెన్ చిత్రానికి అవార్దులు వచ్చాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sP9Upt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...