Sunday, 11 April 2021

Naga Babu: సీఎం జగన్ ఎలాంటి వారో నాకు తెలుసు.. ఇదంతా వాళ్ల పనే! నాగబాబు షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీ- ఎంట్రీ మూవీ ఓ వైపు సంచలనాలు సృష్టిస్తూనే మరోవైపు జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జనాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఇష్యూ కాస్తా పొలిటికల్ ఇష్యూగా మారి రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఈ ఇష్యూపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ స్పందించగా.. తాజాగా మెగా బ్రదర్ రియాక్ట్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఒక్క ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ‘వకీల్‌సాబ్‌’ బెన్‌ఫిట్‌ షోలను నిలిపివేయడం జరిగింది. తాజాగా ఈ ఇష్యూ గురించి నాగబాబు స్పందిస్తూ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు నాగబాబు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ జగన్ బిజీగా ఉన్నారని, కేవలం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు మాత్రమే ఈ పనులు చేసి ఉంటారని నాగబాబు చెప్పడం విశేషం. అంతేకాదు ఒకవేళ జగన్‌కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా ఆయన స్పందించే అవకాశం ఉందని నాగబాబు పేర్కొనడం ఇక్కడ ఆసక్తికర అంశం. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదు, ఏమైనా అనండి కానీ వృత్తిపరమైన జీవితంలో ఇలాంటి ఇబ్బందులు సృష్టించకూడదని.. ఇలాంటి పనుల వల్ల సినిమానే ఆధారంగా చేసుకొని బతుకుతున్న ఎన్నో కుటుంబాలు, కార్మికులు నష్టపోతారని నాగబాబు అన్నారు. జగన్ Vs పవన్ అన్నట్లుగా కొనసాగుతున్న ఈ ఇష్యూపై నాగబాబు ఇలా స్పందించడం మరిన్ని చర్చలకు తెరలేపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wMwNNO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...