Tuesday, 27 April 2021

పెళ్లి సందD హంగామా షురూ.. కొత్త తరం కొత్త జంట అంటూ రాఘవేంద్రుడి సర్‌ప్రైజింగ్ వీడియో

ఎప్పుడో 25 ఏళ్ళ క్రిందట చేసిన ఆ సందడి మళ్ళీ ఇప్పుడు నవతరం ప్రేక్షకలోకం కోసం నయా ''గా రాబోతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే సత్తా ఉన్న సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు మరోసారి మంత్రముగ్దులను చేయబోతున్నాయి. అయితే అందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన రాఘవేంద్ర రావు తాజాగా ఓ చిన్న శాంపిల్ వదిలి సర్‌ప్రైజ్ చేశారు. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇక పెళ్లి సందD హంగామా షురూ చేయాలని ఫిక్స్ అయిన రాఘవేంద్ర రావు.. ఏప్రిల్ 28న సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా నయా పెళ్లి సందD హవాను ఆ రోజే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించి తాజాగా చిన్న శాంపిల్ వీడియో రిలీజ్ చేశారు. కొత్త తరం కొత్త జంట అని పేర్కొంటూ హీరోహీరోయిన్లను చూపించి రేపు (ఏప్రిల్ 28న) విడుదల కాబోయే పాట పట్ల ఆసక్తి రేకెత్తించారు. ఈ సినిమా నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. ఇది సరికొత్త కథతో తెరకెక్కుతున్న మూవీ. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది అని ముందే ప్రకటించిన రాఘవేంద్ర రావు.. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nqjzls
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...