Friday, 23 April 2021

వాట్సప్ డీపీగా అలాంటి ఫోటో.. వాల్ పేపర్‌గా స్టార్ హీరో.. గెటప్ శ్రీను గుట్టు రట్టు

వేదికగా ఎంతో మంది ఆర్టిస్ట్‌లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అలా బుల్లితెరపై సత్తా చాటి వెండితెరపై మెరిశారు. అందులో ఒకరు. జబర్దస్త్ షో మొత్తంలో అత్యధిక గెటప్‌లు వేయడమే కాకుండా.. ఒకదాంతో మరొకటి పోలిక లేకుండా చేసి అందరినీ మెప్పించారు. అందుకే గెటప్ శ్రీనుగా మారిపోయారు. బుల్లితెర కమలహాసన్ అంటూ నాగబాబు ఓ ట్యాగ్ కూడా ఇచ్చేశారు. అలాంటి శ్రీను సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోన్నారు. బుల్లితెరపై నవ్వులు పంచే శ్రీను వెండితెరపైనా విభిన్న పాత్రలు పోషించాడు. ఇప్పుడు చేతిలో అరడజనకు పైగా సినిమాలున్నాయి. అన్నింట్లో కామెడీని పండించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇదే ఊపులో గెటప్ శ్రీను సోలో హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇంతకు ముందు త్రీమంకీస్ అంటూ సుధీర్, రాం ప్రసాద్‌లతో కలిసి ఓ చిత్రాన్ని చేశారు. అయితే ఇప్పుడు రాజు యాదవ్ అంటూ సోలో హీరోగా తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. రాజు యాదవ్ అంటూ వదిలిన టీజర్‌ను ప్రమోట్ చేసేందుకు జబర్దస్త్ యూనిట్ అంతా ముందుకు వచ్చింది. రష్మీ, సుధీర్ ఇలా అందరూ కూడా రాజు యాదవ్ టీజర్‌ను షేర్ చేస్తూ సపోర్ట్ ఇచ్చారు. అయితే తాజాగా గెటప్ శ్రీను తన ఫాలోవర్లతో కాసేపు ముచ్చటించారు. ఏదైనా అడగండి చెబుతాను అని చిట్ చాట్ చేశారు. అలా గెటప్ శ్రీను చాన్స్ ఇచ్చేసరికి ఒక్కొక్కరు తమ క్రియేటివిటీకి పదును పెట్టేశారు. రకరకాల ప్రశ్నలతో గెటప్ శ్రీనును ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినా వీలైనంత మందికి శ్రీను సమాధానాలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా కొందరు గెటప్ శ్రీను సీక్రెట్స్ గురించి అడిగారు. వాట్సప్ డీపీ, ఫోన్ వాల్ పేపర్ ఏంటి అని అడిగారు. అయితే వాటికి సంబంధించిన ఫోటోలను గెటప్ శ్రీను షేర్ చేశారు. గెటప్ శ్రీనుకు చార్లీ చాప్లిన్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆయన ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకున్నారు. ఇక సినిమాల్లో అయితే మెగాస్టార్ చిరంజీవి అంటే శ్రీను మహా ప్రాణం. ఆయన ఇన్స్‌పిరేషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చానని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. అలా చిరంజీవి స్టిల్‌ను వాల్ పేపర్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tXujtO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...