Monday, 26 April 2021

అందులో నువ్ కేక.. బన్నీపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

ఇండియన్ స్క్రీన్ మీద డ్యాన్సులు వేయాలంటే అది కొంత మందికే సాధ్యమవుతుంది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు డ్యాన్సులకు ఫేమస్. వీరు మినహా మిగతా అంతా కూడా సోసోగానే ఉంటారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దాదాపు అరడజన్ హీరోలు డ్యాన్సుల్లో ఇరగ్గొట్టేసే వారున్నారు. అందులో ఎవరి శైలి వారికి ఉంది.కానీ బన్నీ డ్యాన్సులు, గ్రేసులు అంటే అందరూ ఇష్టపడుతుంటారు. తాజాగా సైతం బన్నీ డ్యాన్సులకు ఫిదా అయ్యారు. డీజే సినిమాలోని సాంగ్‌లో బన్నీ ఏ రేంజ్‌లో స్టెప్పులు వేశారో అందరికీ తెలిసిందే. అవి ఐకానిక్ స్టెప్పుల్లా మారిపోయాయి. అలాంటి పాటను సల్మాన్ ఖాన్ వాడుకోవడం విశేషమే. పైగా బన్నీ స్టైల్ స్టెప్పులను కాపీ కొట్టడం, బన్నీ స్టైల్లో డ్యాన్సులు వేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే సల్మాన్ తాజాగా ఓ ట్వీట్ వేశారు. సినిమాలోని సీటీమార్ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. తన పాటను వాడుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని సల్మాన్ ట్వీట్ వేశారు. అంతేకాకుండా ఈ పాటలో డ్యాన్స్ చేసిన తీరు, స్టైల్, అన్నీ కూడా ఫెంటాస్టిక్ కేక అన్నట్టుగా ప్రశంసలు కురిపించేశారు. లవ్యూ బ్రదర్ అంటూ అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేశారు. ఇక సల్మాన్ ప్రశంసలకు బన్నీ తబ్బిబ్బైపోయారు. ఈ మేరకు సల్మాన్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఇలా మీ దగ్గరి నుంచి ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరెంతో మంచి వారు. రాధే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సీటీమార్ పాటకు మీ అభిమానులు స్టెప్పులు వేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చూపించిన ప్రేమకు థ్యాంక్స్ అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sTdi2C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...