Saturday, 17 April 2021

పవన్‌‌పై బాబు గోగినేని సెటైర్.. ‘నేను ఊర కుక్కల్ని పట్టించుకోను..’ అంటూ ఘోరంగా కౌంటర్ ఇచ్చిన నాగబాబు

పవర్‌స్టార్ అంటే ఆయన అభిమానులు ప్రాణం ఇస్తారు. తమ హీరోపై చిన్న కౌంటర్ వేసినా చాలు సోషల్‌మీడియాలో వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా పవన్‌కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. పవన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో తన ఫామ్ హౌస్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతున్న ఫోటో కూడా ఒకటి విడుదల చేసింది. ఈ ఫోటో విడుదలైన వెంటనే పవన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. అభిమానులు కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఓ అభిమాని ఓ అడుగు ముందుకు వేసి.. పవన్ కళ్యాణ్‌ను స్వామి వివేకానంద, చెగూవేరా పరామర్శించడానికి వచ్చినట్లుగా ఆ ఫోటోని మార్ఫింగ్ చేశాడు. కొంత సమయంలోనే ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. పవన్ అభిమానులు ఈ ఫోటోని పెద్ద ఎత్తున షేర్లు చేశారు. అయితే ప్రముఖ హేతువాదీ, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈ ఫోటోపై కాస్త భిన్నంగా స్పందించారు. ఈ ఫోటోని షేర్ చేసిన ఆయన ఈ ఫోటో కార్టూలా ఉందని.. సెటైర్ వేశారు. అయితే ప్రమాదకరమైన వైరస్ సోకి పవన్ బాధపడుతుంటే కనీస విజ్ఞత లేకుండా ఆయనపై సెటైర్లు వేయడాన్ని పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. ఇంతకాలం బాబు గోగినేని అంటే చదువుకుని, జ్ఞానం ఉన్న వ్యక్తి అని తమకు గౌరవం ఉండేదని.. కానీ, ఈ పోస్ట్ చూశాక.. ఆ గౌరవం పోయిందని అంటున్నారు. ఇంకోసారి తమ హీరో గురించి ఇలాంటి పోస్ట్ పెడితే.. ఊరుకోబోమని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ పోస్ట్‌ని ఎవరో అభిమాని మెగా బ్రదర్ నాగబాబుకు షేర్ చేయగా.. ఆయన బాబు గోగినేనిపై ఘోరమైన కౌంటర్ వేశారు. ‘‘నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేయకండయ్యా.. నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటేనే ఇష్టం.. బాబు గోగినేని అంటే కాదు’’ అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. దీనిపై పవన్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘మా పెద్దన్నయ్య నాగబాబు.. నిన్ను(బాబు గోగినేని) ఊర కుక్కతో పోల్చారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో’ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aksVd3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...