Thursday, 8 April 2021

ఇంక హీరోయిన్ల ఫ్యూచర్ ఏంటీ.. ఎన్టీఆర్, అఖిల్‌పై వర్మ వివాదాస్పద ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్

సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే.. ప్రతీ ఒక్కరు తడుముకోకుండా చెప్పే పేరు . వర్మ ఏది చేసినా అందులో ఓ సెన్సెషన్ ఉంటుంది. దాంతో పాటు అదేస్థాయిలో కాంట్రవర్సీ ఉంటుంది. ఒకప్పుడు సూపర్ హిట్ డైరక్టర్‌గా ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు దాదాపు అందరితో పని చేసిన ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం కాంట్రవర్సీనే తన సక్సెస్ మంత్రాగా చేసుకున్నారు. తరచూ ఎవరో ఒక సెలబ్రిటీపై వివాదాస్పద ట్వీట్ చేయడం. ఆ సెలబ్రిటీల అభిమానుల నుంచి విమర్శలు ఎదురుకోవడం. ఆ తర్వాత అందుకు భిన్నంగా మరో ట్వీట్ చేసి.. అప్పటివరకూ జరిగిన తతంగాన్ని అంతా తారుమారు చేయడం వర్మకి కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఈ ఫార్మాలాని ఫాలో అయ్యారు. తాజాగా , అఖిల్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒక ఈవెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ కలిసిన సందర్భంలో వాళ్లు సరదగా ముచ్చటించుకుంటున్న వీడియోని షేర్ చేసిన ఆర్జీవీ ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే.. అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్ వేశారు. ఈ వీడియోలో తారక్ సరదాగా అఖిల్ తొడపై గిల్లడం.. చాలా చనువుగా వీళ్లు ఉండటం మనం గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆర్జీవి చేసిన ట్వీట్‌పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘వాళ్లిద్దరు సరదాగా ఉన్న సందర్భాన్ని తప్పుడు ఉద్దేశ్యంతో చూడటం నీ తప్పు’, ‘రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు నువ్వు నీ గురించి మాకు తెలియదా’ అంటూ వర్మపై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fYjUtR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...