Saturday, 24 April 2021

ఇదీ ప్రభాస్ క్యారెక్టర్! శ్రద్ద, పూజా హెగ్డేల కోసం చేశారు కానీ.. అసలు మ్యాటర్ చెప్పిన శృతి హాసన్

యంగ్ రెబల్ స్టార్ .. పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నా కూడా వ్య్వక్తిత్వం పరంగా మాత్రం చాలా సింపుల్. ఆయనతో పనిచేసిన ప్రతిఒక్కరూ చెప్పే మాట ఇదే. సెట్స్ మీదకొచ్చారంటే పనిపై ఆయన చూపే డెడికేషన్, తోటి నటీనటులతో మెలిగే విధానానికి అంతా ఫిదా అవుతుంటారు. రెబల్ స్టార్ సెట్లో ఉన్నారంటే ఆ సందడే వేరు అని హీరోయిన్స్ చెప్పిన సందర్భాలు బోలెడు. అయితే అందరు హీరోయిన్స్ విషయంలో చేసే ఓ పని విషయంలో మాత్రం చేయలేకపోతున్నారట ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా 'సలార్' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే తన హీరోయిన్స్‌కి, అలాగే బాగా సన్నిహితంగా ఉండే హీరోలకి తన ఇంటి నుంచి భోజనం తెప్పించే అలవాటున్న ప్రభాస్.. శృతి విషయంలో మాత్రం వెనకడుగేశారట. గతంలో సాహో షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇంటి నుంచి భోజనం తెప్పించిన ప్రభాస్, రాధేశ్యామ్ సెట్లో పూజా హెగ్డేకి ఇంటి నుంచి క్యారేజీ తెప్పించి ఇచ్చారు. కానీ 'సలార్' మూవీ షూటింగ్‌లో శృతి విషయంలో అది జరగడం లేదట. అయితే అందుకు ప్రధాన కారణం అటు శృతి హాసన్, ఇటు ప్రభాస్ డైట్‌లో ఉండటమేనని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా శృతినే రివీల్ చేసింది. ''ప్రభాస్ చాలా సింపుల్, అంతటి క్రేజ్ ఉన్న ఆయన అంత సింపుల్‌గా ఉంటారని నేనైతే అనుకోలేదు. ఆయన చాలా ప్రేమతో మాట్లాడతారు. మొదటిసారి ఆయనతో కలిసి పనిచేస్తుండటం ఆనందంగా ఉంది'' అని శృతి తెలిపింది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి 'సలార్' రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రభాస్‌ను ఢీ కొట్టే పాత్ర కోసం కన్నడ స్టార్ మధు గురుస్వామిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32KBPwj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...