జీవితంలో కష్టం, సుఖం.. అప్పుల బాధలు, లగ్జరీ అన్నీ అనుభవించిన వ్యక్తి . నటుడిగా, ప్రొడ్యూసర్‌గా ఎంతో అనుభవం ఉన్న ఆయనకు ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలు మిగిల్చింది 'ఆరెంజ్' మూవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తే అది కాస్తా అట్టర్ ప్లాప్ కావడంతో అప్పులపాలయ్యారు నాగబాబు. అప్పటినుంచి ఈ విషయం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై రియాక్ట్ అయ్యారు మెగా బ్రదర్. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఆరెంజ్ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు మెగా బ్రదర్. అన్ని హంగులతో నిర్మించినా కూడా అంచనాలు తలక్రిందులు చేస్తూ ప్రేక్షకుల ముందు చతికిలపడింది ఈ చిత్రం. దీంతో నాగబాబుకు కోలుకోలేని దెబ్బ పడింది. కానీ, క్రమంగా ఆ ఇబ్బందులన్నీ అధిగమిస్తూ ఇప్పుడు తిరిగి ఫైనాన్సియల్‌గా స్ట్రాంగ్ అయ్యారు నాగబాబు. అయితే ఆ సమయంలో ఎవరి సహకారంతో తిరిగి కోలుకున్నాను. అప్పుల బాధల నుంచి ఎలా బయటపడగలిగాను అనే దానిపై ఆయన వివరణ ఇచ్చారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలోని అన్ని విషయాలపై మాట్లాడే మెగా బ్రదర్.. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలో ‘సార్ సీరియస్‌గా ఒక విషయం తెలుసుకోవాలి. ఆరెంజ్ మూవీ తర్వాత రామ్ చరణ్ మనీ' అని ఓ నెటిజన్ నాగబాబును ప్రశ్నించాడు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన మెగా బ్రదర్ అసలు మ్యాటర్ బయటపెట్టేశాడు. మా అన్నయ్య నా అప్పులో సగం తీర్చాడు అని చెప్పిన నాగబాబు.. ఆరెంజ్ సినిమాకు గాను రామ్ చరణ్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, కాకపోతే భవిష్యత్‌లో ఎప్పటికైనా ఆ రెమ్మ్యూనరేషన్ చెల్లిస్తానని నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు లైఫ్ హ్యాపీగా గడుస్తోంది. క్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకొని తన కెరీర్ కొనసాగిస్తున్నారాయన.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RIK2z3
v
No comments:
Post a Comment