Monday, 19 April 2021

జబర్దస్త్ వర్షకు కరోనా.. చూస్తే భయపడతారు.. పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ఆవేదన

ప్రస్తుతం మన దేశంలో ఉధృతి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా విధించారు. ఇప్పుడిప్పుడు జనాలు కూడా స్వచ్చందంగా క్వారంటైన్‌లోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో కొందరు స్టార్ సెలెబ్రిటీలు కరోనా బారినపడ్డారు. వకీల్ సాబ్ సినిమా యూనిట్‌లో కరోనా ఎంతటి కలకలం స‌ృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బుల్లితెరకూ ఈ కరోనా పాకింది. జబర్దస్త్ బ్యూటీ వర్షకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వర్ష ప్రకటించేశారు. తాజాగా లైవ్‌లోకి వచ్చి ఈ విషయాన్ని ప్రకటిస్తూ తన ఫాలోవర్లందరికీ కొన్ని సూచనలు ఇచ్చారు. ‘ఇలా సడెన్‌గా లైవ్‌లోకి వచ్చాను అందరూ ఆశ్చర్యపోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఇలా రావాల్సి వచ్చింది. ఓ రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి అంత సీరియస్‌గా ఏమీ అనిపించలేదు కానీ కరోనా పరీక్షలు చేసుకున్నాను. అందులో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని లైవ్‌లోకి వచ్చి ఎందుకు చెప్పాలి అని అనుకున్నాను అంటే.. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఇక్కడ జరిగిందేది ఎవ్వరికీ తెలియదు.. చూస్తే భయపడతారు. చనిపోయిన వారిని అలా ప్యాక్ చేసి పడేస్తున్నారు. అది చూడగానే లైవ్‌లోకి వచ్చిచెప్పాలని అనుకున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి.. రోజూ వేడి నీళ్లు తాగండి.. ఇంకా ఏ జాగ్రత్తలు ఉంటే అవన్నీ తీసుకోండి’ అని వర్ష అందరికీ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ఇక వర్ష ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n1KQdG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...