Saturday, 17 April 2021

పవన్ కళ్యాణ్ పరిస్థితి‌పై అషు రెడ్డి ఎమోషనల్.. లైవ్‌లో కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ

పవర్ స్టార్ ఫాన్స్ అంటే ఏంటనేది ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. పవన్ అంటే పడిచచ్చే అభిమాన వర్గమే కాదు పవన్‌ని అమితంగా ఇష్టపడే సెలబ్రిటీలు కూడా ఎందరో ఉన్నారు. అందులో ఒకరే బిగ్ బాస్ ఫేమ్, డబ్ స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన . ఈ బ్యూటిఫుల్ లేడీకి పవన్ కళ్యాణ్ అంటే ఒకరకమైన పిచ్చి. అయితే నిన్న (శుక్రవారం) పవన్‌కి అని తెలియడంతో అషు ఎమోషనల్ అయింది. లైవ్ లోనే కన్నీరు పెట్టుకుంటూ వీడియో రిలీజ్ చేసింది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ వచ్చింది. కాకపోతే ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను బలంగా నమ్ముతున్నా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది అషు రెడ్డి. ''ఆయన ఆరోగ్యం కోసం నేను ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేను. దేవుడున్నాడు.. పవన్ త్వరలోనే తిరిగి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకొస్తారు. సెకండ్ వేవ్ చాలా డేంజర్‌గా ఉంది. దయచేసి మీరందరూ కూడా మాస్క్ వేసుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ మీ ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలా జాగ్రత్త ఉండండి'' అని పేర్కొంటూ కన్నీరు పెట్టుకుంది అషు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎవరికి వారు తమదైన స్టైల్ కామెంట్ వదులుతున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ విషయమై ఎన్నోసార్లు సంచలనం సృష్టించింది అషు రెడ్డి. తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు పొడుపించుకుని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్‌గా పవన్‌ని నేరుగా కలిసిన ఆమె.. తన దేవుడ్ని మళ్లీ కలుసుకున్నా అంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. ఆ సమయంలో పవర్ స్టార్ తన పచ్చబొట్టును జ్ఞాపకం తెచ్చుకున్నాడని, ఎప్పుడూ ఆయనే తన ఫస్ట్ లవ్ అని చెప్పింది అషు. అంతేకాదు ఆయనకు నాలుగో భార్యాగా ఉండడానికి సిద్దమే అని కుండబద్దలు కొట్టేసింది అషు రెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gjHH7M
v

No comments:

Post a Comment