Friday, 16 April 2021

‘నేను అంత డబ్బు సంపాదిస్తే.. ఈ పోస్ట్ పెట్టాల్సిన అవరసం వచ్చేది కాదు’.. నెటిజన్‌కి ధీటుగా రిప్లే ఇచ్చిన హీరో

అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరు దాని ఎడిక్ట్ అయిపోతున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకూ చాలా మంది సోషల్‌మీడియాలోనే ఉంటారు. అయితే కొందరు ఈ సోషల్‌మీడియాను మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరి కొందరు మాత్రం దుర్వినియోగం చేస్తుంటారు. ఇతరులపై చలకనగా కామెంట్లు చేయడం.. లేదా వాళ్ల వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి పోస్ట్‌లు పెట్టడం చేస్తుంటారు కొందరు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక సెలబ్రిటీ ఏదైనా పోస్ట్ చేశారంటే.. అందులో ఏ తప్పు వెతుకుదామా.. ఎలాంటి సెటైర్ వేద్దామా.. అని ఆలోచించడమే వీరి పని. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ.. అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఎస్‌ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అయాంన్ష్ అనే కుర్రాడు కోలుకోవాలంటే.. దాదాపు రూ.16 కోట్ల ఖరీదైన ఓ ఇంజిక్షన్ అతనికి ఇవ్వాలి. దీంతో అతని తల్లిదండ్రులు విరాళాల కోసం ఓ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా వాళ్లు డబ్బు సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఆ బాలుడికి తగిన సహాయం అందించాలని తన ఫాలోవర్లను కోరాడు. అయితే అర్జున్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటూ కామెంట్ చేశారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం కాస్త వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. ‘నీ ఒక్క రోజు జీతంతో అతని వెంటనే నువ్వు కాపాడగలవు’ అంటూ ఓ వ్యక్తి పెట్టిన కామెంట్‌కి అర్జున్ ధీటుగా జవాబు ఇచ్చాడు. ‘నేను ఒకవేళ ఒకరోజు రూ.16 కోట్లు సంపాదిస్తే.. ఈ పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది తెలిసే నేను నాకు తోచిన సహాయాన్ని ఇప్పటికే చేశాను. అతనికి మరింత సహాయం అందాలనే ఈ పోస్ట్ చేశాను’ అంటూ అర్జున్ సదరు కామెంట్‌కి రిప్లే ఇచ్చాడు. నెటిజన్ వేసిన సెటైర్‌కి ఎంతో ఓపికగా జవాబు ఇచ్చిన అర్జున్‌ని మెచ్చుకుంటూ.. ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32kK7uG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...