Wednesday, 7 April 2021

స్టైలిష్ స్టార్.. ఇకపై ఐకాన్ స్టార్.. ఎలా ఉంది స్టైల్‌గా ఉంది కదూ: అల్లు అర్జున్ స్పీచ్

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ టీజర్‌ లాంజ్ ఈవెంట్‌లో బర్త్ డే బాయ్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైడియర్ ఫ్యాన్స్.. మై ఆర్మీ థాంక్యూ.. ఇవాళ ఈ ఫంక్షన్‌కి వచ్చి నన్ను ఇంత ప్రేమిస్తున్న మీకు చాలా పెద్ద థాంక్స్. ఇది కేవలం టీజర్ లాంచ్ ఈవెంట్ మాత్రమే కాదు.. నా పుట్టినరోజుని మీతో సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏమి ఉంటుంది చెప్పింది.. ‘తగ్గేదే ల్యా’. నా లైఫ్‌లో ఈ బర్త్ డే చాలా స్పెషల్ ఎందుకంటే.. రెండు విషయాలు చెప్పాలి.. ఒకటి పుష్ప టీజర్. మీకు మొదటి నుంచి ఒక్కటే చెప్తున్నా.. పుష్ప అంటే తగ్గేదే ల్యా. రెండోది.. నా లైఫ్ టేకాఫ్ అయ్యిందే ఆర్య సినిమాతో. ఆ సినిమాతోనే నాకు స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇవాళ నా ఫ్యూచర్ అంతా కొత్త పేరుతో ముందుకు వెళ్లబోతుందని అర్థమైంది. అదే . సుకుమార్ గారు నాకు ఏం ఇచ్చినా గుర్తుండిపోతుంది.. పుష్ప కూడా అంతే. ఆయన అంటూ ఉంటారు.. నువ్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌కి వెళ్లిపోవాలని. థాంక్యూ డార్లింగ్. సింపుల్‌గా చెప్పాలంటే.. ఐకాన్ స్టార్ చాలా స్టైల్‌గా ఉంది కదా.. నాకూ నచ్చింది ఈ ఐకాన్ స్టార్. నేను నా సినిమా ఏదైనా నచ్చాల్సింది నాకు కాదు మీకు. పుష్ప సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్ ఉంది.. పర్సనల్‌గా కూడా నాకు నేను ఆ మాట చెప్పుకుంటా.. ఎందుకంటే.. మీ అందరిలాగే నాకూ భయాలు ఉంటాయి.. కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్లాలి.. తగ్గేదే లేదు అని అనుకుంటా.. అలా అనుకున్నా కాబట్టే ఇంత దూరం వచ్చా. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు తగ్గి ఉండాలని.. అస్సలు తగ్గాల్సిన పనిలేదు.. తగ్గేదే లే. ఇది అబ్బాయిలకు సంబంధించినదే కాదు.. అందరికీ సంబంధించినది. ఈ తగ్గేదే లే నా మనసుకి దగ్గరైన మాట.. నా బర్త్ డే సందర్భంగా చాలా మంది మంచి పనులు చేస్తున్నారని వాళ్లందర్నీ చూస్తున్నానని.. కోవిడ్ ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ స్పీచ్ ముగించారు అల్లు అర్జున్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R5acLN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...