Wednesday, 28 April 2021

బ్రేకింగ్: అల్లు అర్జున్‌కు కరోనా.. అభిమానులకు స్టైలిష్ స్టార్ విజ్ఞప్తి

దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి సినీ ఇండస్ట్రీని వీడటం లేదు. సాధారణ, సెలబ్రిటీ అనే తేడాలేకుండా అందరినీ చుట్టేస్తూ ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు కరోనా బారినపడగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు బన్నీ. ''అందరికీ నమస్కారం.. నాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నాను. ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కరోనా పట్ల కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోండి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సన్నిహితులు, ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు'' అని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రంలో గిరిజన యువతిగా రష్మిక నటిస్తుండగా.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు సుకుమార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b2MJ5l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...