Sunday, 11 April 2021

శుభవార్త చెప్పిన యాంకర్ సమీరా.. ఆ ఫొటోతో అసలు మ్యాటర్ బయటపెట్టేసింది!! పక్కనే భర్త కూడా..

బుల్లితెర నటిగా అందరికీ సుపరిచితమైన తాజాగా ఓ శుభవార్త చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె సీనియర్ నటి సన కుమారుడు అన్వర్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమకథలో ఎన్నో ట్విస్టులు. చెల్లి కోసం వరుడిని వెతుకుతూ చివరకు ఆ వ్యక్తినే పెళ్లాడింది సమీరా. అంతేకాదు రీసెంట్‌గా తన రొమాంటిక్ లవ్ స్టోరీని స్వయంగా బయటపెట్టేసి ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తాజాగా భర్త సమక్షంలో ఓ సంతోషకర విషయాన్ని అందరితో పంచుకుంది ఈ యంగ్ యాంకర్. ప్రస్తుతం తాను గర్భవతిని అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ చాలా డిఫరెంట్‌గా మ్యాటర్ బయటపెట్టింది సమీరా. తన భర్త అన్వర్‌తో కలిసి ఈ శుభ సందర్భాన్ని అందరికీ తెలియజేసింది. సమీరాతో పాటు ఆమె భర్త అన్వర్ ఇద్దరూ ఒకే కలర్, ఒకేలా ఉండే టీ- షర్ట్స్ ధరించి ఫొటోకి పోజిచ్చారు. వాళ్లిద్దరి టీ- షర్ట్స్‌పై ''ఈ విషయం మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. బేబీ ఆన్ ది వే'' అని రాసి ఉంది. ఈ ఫొటోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది సమీరా. దీంతో ఈ దంపతులకు నెటిజన్ల నుంచి పెద్దఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. 2006 సంవత్సరంలో ‘ఆడపిల్ల' సీరియల్‌తో బుల్లితెర ప్రయాణం స్టార్ట్ చేసిన సమీరా షరీఫ్.. ఆ తర్వాత అభిషేకం, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక నాగబాబు 'అదిరింది' షోతో యాంకర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్త స్లో అయింది సమీరా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QjjtPT
v

No comments:

Post a Comment