Monday, 5 April 2021

‘నువ్వు ఎంతో దూరం వెళ్లిపోయావు’.. రష్మిక బర్త్‌డే రోజున మాజీ ప్రియుడి ఎమెషనల్‌ ట్వీట్

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ .. ఆ తర్వాత వరుసగా హిట్‌ సినిమాల్లో నటించి.. తనది గోల్డెన్ లెగ్‌ అనే ముద్రని సంపాదించుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రష్మిక నటించిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్‌హిట్ సాధించడం ఈ బ్యూటీకి చాలా ప్లస్‌పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత మరోసారి విజయ్‌తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో రష్మిక నటించింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడింది. అయినప్పటికీ రష్మిక క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఈ భామ. ఇలా తన కెరీర్‌ని పెంచుకుంటూ పోయే క్రమంలో తన మాజీ ప్రియుడు.. కన్నడ సినిమా ‘కిరిక్‌ పార్టీ’ సినిమా హీరో రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ని రష్మిక మందన్న బ్రేక్‌ అప్ చేసుకుంది. వ్యక్తిగత కారణాల వల్లే ఈ బ్రేకప్ జరిగిందని రష్మిక అప్పట్లో వెల్లడించింది. కాగా, సోమవారం(ఏప్రిల్ 5న) రష్మిక తన 25వ పుట్టినరోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు ఓ ప్రత్యేకమైన కానుకని ఇచ్చాడు. ‘కిరిక్ పార్టీ’ సమయంలో రష్మిక ఇచ్చిన ఆడిషన్ వీడియోని అతను తన షోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ‘‘నీ కిరిక్ పార్టీ ఆడిషన్‌కి సంబంధించిన ఓ అందమైన అనుభవాన్ని షేర్ చేస్తున్నాను. అప్పటి నుంచి నువ్వు ఎంతో దూరం ప్రయాణించావు.. నీ కలలు సాకారం చేసుకొనేందుకు ఓ యోధురాలిగా పోరాడుతున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. హ్యాపీ బర్త్‌ డే టూయూ’’ అంటూ రక్షిత్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై రష్మిక వెంటనే స్పందించింది. ‘‘అవును ఇది నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. రక్షిత్ చాలా థ్యాంక్యూ. ఇది ఎంతో విలువైనది’’ అంటూ రీట్వీట్ చేసింది. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రష్మిక బాలీవుడ్ ఛాన్స్ కూడా కొట్టేసింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ ఆమె ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31N7AV5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...