Sunday, 18 April 2021

కరోనా బారిన పడ్డ హీరో, హీరోయిన్.. ధైర్యంగా ఉండాల్సిన సమయమిది అంటూ పోస్ట్

కరోనా సెకండ్ వేవ్‌లో రోజుకి లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ.. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. లాక్‌డౌన్ నిబంధనలు లేకపోవడం.. ముఖ్యంగా ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం.. వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. ఈసారి వైరస్ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై ఎక్కువగా ఉంది. ఉత్తర, దక్షిణ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులకు ఈ వైరస్ సోకింది. దీంతో వాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కొందరు వైరస్ నుంచి సురక్షితంగా కోలుకున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీకి చెందిన కొందరు కూడా వైరస్ బారిన పడ్డారు. నటి నివేదా థామస్, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, బండ్ల గణేశ్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన తన ఫామ్ హౌస్‌లో ఉంటూనే చికిత్స పొందుతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా కరోనా వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా మరో హీరో అధర్వ మురళీ, ఒకప్పటి నటి సమీరా రెడ్డిలకు కరోనా సోకింది. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాతో అధర్వ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి.. వివాహం తర్వాత చిత్ర పరిశ్రమకి దూరం అయింది. అయితే తమకు కరోనా సోకిందని వీరిద్దరు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘నాకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో.. టెస్టులు జరుపగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తగిన జాగ్రత్తలతో క్వారంటైన్‌లో ఉంటున్నాను. త్వరలోనే కోలుకొని మళ్లీ పనిలో చేరి మిమ్మల్ని అలరించాలని ఆశిస్తున్నాను’ అని అధర్వ ట్వీట్ చేయగా.. ‘శనివారం కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం మేము ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాం. మరింత ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇదీ. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను’ అంటూ సమీరా పోస్ట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ttEOVR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...