Saturday, 10 April 2021

ఇది మరీ దారుణం.. ఇలాంటి పనులేంటి? పవన్‌ అభిమాని తీరుపై అనసూయ షాకింగ్ రియాక్షన్

స్టార్ హీరోల అభిమానులు చేసే పనులు ఒక్కోసారి పిచ్చెక్కిస్తుంటాయి. హీరోపై తమ అభిమానాన్ని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు ఫ్యాన్స్. వాళ్లు చేసే కొన్ని పనులు సడెన్ షాకిస్తుంటాయి. తాజాగా ఫ్యాన్ ఒకరు అలాంటి పనే చేయడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు. పవర్ స్టార్ మూడేళ్ల తర్వాత వెండితెరపై '' రూపంలో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. దీనికి తోడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని ఏకంగా సిల్వర్ స్క్రీన్‌పై రక్తం చిందించాడు. వకీల్ సాబ్ ప్రదర్శితమవుతున్న తెరపై స్క్రీన్‌ వద్దకు చేరుకుని రక్తంతో పవన్‌ పేరు రాసేశాడు. PSPK అంటూ పవన్ పేరు రాయడంతో అక్కడున్న వాళ్లంతా మనోన్ని చూసి ఈలలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే దీనిపై యాంకర్ ఆనసూయ రియాక్ట్ అయింది. ''ఇది మరీ దారుణం.. ఇలాంటి చర్యలను ఎదుటివాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారో అర్థం కావడం లేదు.. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించారా? అభిమానం చాటుకోవడానికి ఎన్నో దారులున్నాయి. కొంచెం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అందరికీ బాగుంటుంది'' అని ఈ వీడియో చూశాక తన ఫీలింగ్స్ బయట పెట్టారు. అనసూయ మాత్రమే కాదు ఈ వీడియో చూశాక నెటిజన్లు సైతం 'ఏంటి పిచ్చి కాకపోతేనూ!' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన 'వకీల్ సాబ్ 'సినిమాకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ టేకింగ్ ప్లస్ అయింది. మాతృక 'పింక్' సినిమాను తెలుగు నేటివికీ దగ్గరగా చూపిస్తూ పవన్ హీరోయిజం ఎలివేట్ చేశారు వేణు. ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అన్ని ఏరియాల్లో తొలి రోజే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wK2TcU
v

No comments:

Post a Comment