Thursday, 22 April 2021

మెగా ఫ్యామిలీని వీడని కరోనా మహమ్మారి.. చిరు అల్లుడికి కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఫ్యాన్స్

వైరస్ రెండో దశలో ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతీ ఒక్కరిని ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈసారి వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా సోకి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్నారు. టాలీవుడ్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్‌లు యధావిధిగా ప్రారంభమయ్యాయి. తగిన జాగ్రత్తలతో షూటింగ్‌లు చేస్తున్న నటీనటులు, టెక్నీషియన్లు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ నివేదా థామస్, నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేశ్, అల్లు అరవింద్ తదితరులకు వైరస్ సోకింది. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి వైరస్ సోకడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఇక రెండో దశ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్‌డౌన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూతో పాటు థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక.. నిర్మాతలు కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని షూటింగ్‌లు వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా పడ్డ సినిమాల్లో మెగాస్టార్ నటిస్తున్న ‘ఆచార్య’, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీకి ఇప్పట్లో కరోనా కష్టాలు తప్పేలా పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డాడు. ‘విజేత’ అనే సినిమాతో కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. తనకి కరోనా సోకిన విషయాన్ని కళ్యాణ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించడు. తనకి స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని.. అందుకే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు అతను స్పష్టం చేశాడు. దీంతో ఆందోళనకు గురైన మెగా అభిమానులు కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dEIoGR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...