Friday, 16 April 2021

ఆ హీరో వర్జిన్.. పాపం పుణ్యం ఏం తెలియదు: బాలయ్య సెటైర్లు హైలెట్

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అద్వయ జిష్ణు రెడ్డి నిర్మాతగా.. హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఫన్ ఎంటర్ టైనర్ మూవీ ‘సెహ‌రి’. ఇటీవల ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ బాల‌కృష్ణ చేతుల మీదుగా విడుద‌ల కాగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్‌లో బాలయ్యను బాగా వాడేశారు చిత్ర యూనిట్. ఆయన స్పీచ్‌తోనే టీజర్‌ను మొదలుపెట్టి ఫన్ జనరేట్ చేశారు. ‘హ‌ర్ష్.. మన సినిమా హీరో.. అతను కూడా వర్జిన్.. ఇవ్వాలే పుట్టాడు.. ఇతనికి పాపం పుణ్యం ఏం తెలియదు’ అని సెటారికల్‌గా మాట్లాడటం.. హీరో తెగ సిగ్గుపడిపోవడాన్ని చూపించారు. ఇక సినిమా టీజర్‌ ఫ్రెష్ లుక్‌తో చాలా ఇంప్రెసివ్‌గా ఉంది.. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టీజర్‌లో హర్ష్‌ డైలాగ్‌లు, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. హర్ష్ లుక్స్ పరంగా బిగ్ బాస్ అభిజిత్‌లా కనిపిస్తున్నాడు. ఇక సిమ్రన్ చౌదరి బబ్లీ గర్ల్‌గా కనిపించింది. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించగా.. అభినవ్‌, ప్రణీత్‌ రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించారు. ప్రశాంత్‌ ఆర్‌.విహరి స్వరాలను సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e6h2IR
v

No comments:

Post a Comment