Sunday, 11 April 2021

‘మిగితా వాళ్లకి మీకు తేడా ఏంటీ’.. అభిమాని అడగగానే పుట్టుమచ్చ చూపించేసిన బాలీవుడ్ బ్యూటీ

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ దిశా పటానీ. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైందీ భామ. ఇక ఈ అమ్మాయి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ బికినీలో ఫోటో షూట్‌లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా దిశా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘ఆస్క్ మై ఎనీథింగ్’ అంటూ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెని ‘ఇతరులకి మీకు ఉన్న తేడా ఏంటీ అని’ ప్రశ్నించారు. వెంటనే దిశా తన కంటిని జూమ్ చేసి ఫోటో తీసి ‘నాకు కంటి కింద పుట్టుమచ్చ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కుంగ్‌ ఫూ యోగా, భాగీ-2 వంటి చిత్రాలతో తన సత్తా చాటుకుంది దిశా. ప్రస్తుతం దిశా ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తోంది. హీరోగా నటిస్తున్న ‘రాధే’ అనే చిత్రంలో ఆమె హీరోయిన్‌గా అలరించనుంది. ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 13న విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uL3gSv
v

No comments:

Post a Comment