Wednesday, 21 April 2021

నా బ్లడ్ బదర్స్ ఇకలేరు.. ఒకేరోజు ఇద్దరూ.. చిరంజీవి తీవ్ర భావోద్వేగం

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్నటి వరకూ ఆరోగ్యంగా మన కళ్ల ముందు కనిపించిన వారు ఈ రాకాసి కరోనా వల్ల కనుమరుగైపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ చుట్టుముట్టేస్తుంది మాయదారి కరోనా. కొన్ని వేల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఈ కరోనా.. సినిమా ఇండస్ట్రీని వదల్లేదు. ఈ కరోనా ప్రభావంతో చాలా మంది సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ తరుణంలో మెగాస్టార్ తన అత్యంత ఆత్మీయుల్ని కోల్పోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా తనని ఆదిరిస్తూ.. అభిమానిస్తున్న ఇద్దరు ఆప్తుల్ని ఒకేసారి కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉన్నారు చిరంజీవి. తన బ్లడ్ బ్రదర్స్‌ని కోల్పోయానంటూ ట్విట్టర్ ద్వారా బాధని తెలియజేశారు చిరంజీవి. ‘‘ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ తన బాధను పంచుకున్నారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ezYIIz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...