Friday, 2 April 2021

ముచ్చటగా మూడో సినిమా మొదలెట్టిన 'ఉప్పెన' స్టార్.. వైష్ణవ్ తేజ్ న్యూ మూవీ షురూ

తొలి సినిమా 'ఉప్పెన'తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్న మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. కెమెరా ముందు తనదైన హావభావాలు పలికిస్తూ తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా ఆకర్షించిన ఆయన ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టేశాడు. ఉప్పెన చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో తన రెండో మూవీ ఫినిష్ చేసి నేడు (ఏప్రిల్ 2) మరో సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అర్జున్ రెడ్డి కథను తమిళ్‌లో రీమేక్ చేసిన గిరీశయ్య దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ముందుగా వార్తలు వచ్చినట్లుగానే వైష్ణవ్ తేజ్ సరసన ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ హీరోయిన్‌గా నటించనుంది. నేటి ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి ధరమ్ ‌తేజ్‌ విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టారు. వైష్ణవ్ తేజ్ తల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సినిమాతో లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది చిత్రయూనిట్. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. నేటితరం ఆడియన్స్ కోరుకునే విధంగా రొమాంటిక్ అంశాలు జోడించి ఈ మూవీ కథను రెడీ చేశారట డైరెక్టర్ గిరీశయ్య. అతిత్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rQ9G1a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...