Friday, 16 April 2021

రాజమౌళి, త్రివిక్రమ్ వద్ద పనిచేసిన సీనియర్ కో- డైరెక్టర్ సత్యం కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటి క్రితం (ఏప్రిల్ 17) ప్రముఖ సీనియర్ అనారోగ్య కారణంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో చాలా కాలంగా కో డైరెక్టర్‌గా పని చేస్తూ ఎన్నో సినిమాల్లో తెరవెనుక భాగం పంచుకున్న సత్యం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రాజమౌళి, త్రివిక్రమ్‌‌లతో పాటు కృష్ణ వంశీ లాంటి స్టార్‌ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌‌గా సత్యం పనిచేశారు. మంచితనం, పని పట్ల నిబద్దతతో దర్శకులందరికి ఆప్తుడిగా ఉండేవారు సత్యం. 'సై' సినిమాకు చీఫ్‌ కో డైరెక్టర్‌గా పని చేసిన సత్యం ఆ తర్వాత ''శ్రీరామదాసు, చందమామ'' సినిమాలకు కో డైరెక్టర్‌గా సేవలందించారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. సత్యం మరణించారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో విషాదం నింపింది. ఆయన ఇకలేరని తెలిసి ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. కాగా ఆయన కరోనా కారణంగా మరణించారని తెలుస్తోంది. ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటూనే ఆయన కన్నుమూశారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3glL3ai
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...