Saturday, 3 April 2021

డైరెక్టుగా అదే అడిగేసిన జబర్దస్త్ బ్యూటీ.. అనసూయ షాకింగ్ వీడియో వైరల్! పెళ్లైన మాట మరిచిందా..?

బుల్లితెర యాంకర్‌గా భారీ పాపులారిటీ సంపాదించిన వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మతగా నటించిన ఈ జబర్దస్త్ బ్యూటీ తన గ్లామర్‌తో యమ అట్రాక్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం అమ్మడి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో అనసూయ చేసే హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్ పంచుకుంటూ మత్తెక్కించే ఈ అమ్మడు తాజాగా ఓ వీడియో షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఎన్నో ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ మనసు లవ్ ప్రపోజ్‌పై పడిందని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ‘నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా.. దానికి చేశావ్.. రాణికి చెప్పావ్.. శృతికి చేప్పావ్.. గీతకు చెప్పావ్.. వాళ్లందరి కన్నా నేనే బాగుంటాను కదరా' అనే డైలాగ్‌ చెబుతూ ఈ వీడియోలో కనిపించింది . దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అనసూయ వీడియో పెడితే నెటిజన్స్ ఊరుకుంటారా? అది కూడా నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా అంటే ఆగుతారా..? వెంటనే పెద్దఎత్తున ఆమెకు లవ్ ప్రపోజల్స్ పెడుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం 'మీకు పెళ్లయింది కదా! మేడం అందుకే' అంటూ ఆమెకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇస్తున్నారు. మీ ఆయన ఫీల్ అవుతాడు మేడం అనేవారు కూడా చాలామందే ఉన్నారు. ఏదేమైనా అనసూయ పోస్ట్ చేసిన ఈ వీడియో మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఇకపోతే అనసూయ కెరీర్ అంటారా.. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది ఈ జబర్దస్త్ బ్యూటీ. పలు టీవీ షోలతో సినిమా అవకాశాలతో బిజీ షెడ్యూల్ మెయిన్‌టైన్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ' సినిమాతో పాటు 'థాంక్యూ బ్రదర్' మూవీ చేస్తున్న ఆమె సునీల్ ‘వేదాంతం రాఘవయ్య', రవితేజ ‘ఖిలాడీ'లోనూ ముఖ్యపాత్రల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pngar9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...