Saturday, 24 April 2021

చిన్నారి రాకతో పెళ్లి రోజు స్పెషల్.. ప్రతిరూపాన్ని చూసి మురిసిపోయిన హరితేజ

బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ తల్లి అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తనకు పాప పుట్టిన సంగతి చెబుతూ చేసిన పోస్ట్ ఎంతగానో వైరల్ అయింది. అంతకు ముందు ఆమె బేబీ బంప్‌తో చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. మామూలుగా సెలెబ్రిటీలు ఈ మధ్య బేబీ బంప్‌తో ఫోటో షూట్లు చేయడం కామన్ అయిన విషయం తెలిసిందే. అయితే కరీనాకపూర్, అమీ జాక్సన్, సమీరా రెడ్డి వంటి వారంతా బేబీ బంప్‌ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. హరితేజ సైతం తన గర్భాన్ని చూపిస్తూ ఫోటో షూట్ చేశారు. అంతే కాకుండా వేడుకలు సోషల్ మీడియాను షేక్ చేసింది. సీమంతం వేడుకల్లో హరితేజ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. గర్భంతో ఉన్నా కూడా పార్టీలు, పబ్‌ల్లో పాటలు పాడారు. మొత్తానికి హారితేజ బిడ్డను కనబోతోన్న సంతోషంలో రచ్చ రచ్చ చేశారు. ఇక తమకు అమ్మాయి పుట్టిందని చెబుతూ హరితేజ ఓ పోస్ట్ చేశారు. కానీ ఆ చిన్నారి ఫోటోను మాత్రం బయటకు రానివ్వలేదు. అయితే తాజాగా హరితేజ తన ప్రతిరూపమైన బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేడు తమ పెళ్లి రోజు అని చెబుతూ ఎంతో మురిసిపోయారు. అంతే కాకుండా తమ బిడ్డ రాకతో ఎంతో ప్రత్యేకంగా మారిపోయిందంటూ మొదటిసారిగా తన కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ... నువ్ ఈ వివాహా దినోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా చేశావ్.. జీవితంలో గుర్తుండిపోయేలా చేశావ్.. హ్యాపీ యానివర్సరీ దీపు అంటూ తన భర్త, పాపపై హరితేజ ప్రేమను కురిపించారు. ఇక ఈ పోస్ట్‌పై శివజ్యోతి, సమీర, చైత్ర వంటి సెలెబ్రిటీలందరూ కామెంట్ చేశారు. ప్రస్తుతం హరితేజ ఫ్యామిలీ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tOTyPb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...