Sunday, 25 April 2021

బిగ్ బాస్ విన్నర్‌కు కరోనా భయం.. ఇంట్లోకి వెళ్లే ముందు ఇలా.. కౌశల్ వీడియో వైరల్

ప్రస్తుతం దెబ్బకు అందరూ వణికి పోతోన్నారు. సెకండ్ వేవ్‌లో కరోనా ధాటికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతంగా పెరిగిపోతోంది. రోజుకు మన దేశంలో లక్షల్లో కరోనా కేసులు వస్తున్నాయి. కరోనా ధాటికి తట్టుకోలేక సినీ ఇండస్ట్రీలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు షూటింగ్‌లన్నీ కూడా మూలన పడ్డాయి. అయితే కొందరు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లు చేస్తున్నారు. అలా అతి తక్కువ మందితో షూటింగ్ చేసినా కూడా కొందరు కరోనా బారిన పడుతున్నారు. స్టార్ హీరోల స్టాఫ్, చిత్రయూనిట్‌లో ఎవరో ఒకరు కరోనా దెబ్బకు కుదేలవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్‌కు సైతం కరోనా భయం పట్టుకుంది. తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ అసలు విషయాన్నిచెప్పేశారు . అసలే ఇప్పుడు కౌశల్ ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్, సినిమాలు అంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మోడలింగ్‌లో కౌశల్ దూసుకుపోతోన్నారు. అయితే నెల రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉన్న కౌశల్ తన బృంధంలోని ఓ సభ్యుడికి కరోనా వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. నా డిజైనర్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.. అందుకే నెల రోజుల తరువాత పిల్లల్ని కలుస్తున్నాను. ఎందుకైనా మంచిది అని ఇలా పరీక్షలు చేయించుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్త పడటం మంచిదే అని సూచించారు. బిగ్ బాస్ రెండో సీజన్‌లో కౌశల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రెండో సీజన్ టైటిల్ విన్నర్‌గా కౌశల్ రికార్డులు క్రియేట్ చేశారు. అయితే కౌశల్ టైటిల్ గెలవడంపై ఎన్ని వివాదాలు వచ్చాయో కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆది హీరోగా వస్తోన్న ఈ చిత్రంతో కౌశల్‌కు బ్రేక్ వస్తుందేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xqvhRx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...