మాస్, భారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ . మొదటి సినిమా నుంచే యాక్షన్‌ని తన సినిమాకి కీ పాయింట్‌గా పెట్టుకున్నాడు బోయపాటి. తొలి సినిమా భద్రతో సూపర్ హిట్ అందుకున్న ఆయన నందమూరి బాలకృష్ణతో ‘సింహా’, లెజెండ్’ సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకన్నాడు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి బాలకృష్ణతో జతకడుతున్నాడు బోయపాటి. కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ ‘’ అని చెబుతూ.. చిన్న టీజరర్ వదిలారు. అఘోరా గెటప్‌లో ఈ టీజర్లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్ ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి మరో నందమూరి హీరోతో సినిమా చేసేందుకు అవుతున్నాడట. నందమూరి కళ్యాణ్‌రామ్‌తో బోయపాటి తన నెక్ట్స్ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథని వినిపించగా.. అందుకు అతను ఓకే చెప్పినట్లు సమాచారం. పూర్తి మాస్, మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్, తర్వాత బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న మూడో నందమూరి హీరోగా కళ్యాణ్‌రామ్ నిలువనున్నాడు. ప్రస్తుతం రాజేంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు నవీన్ మేడారం దర్శకతంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తయ్యాయి. ఈ రెండు సినిమా తర్వాత బోయపాటి-కళ్యాణ్ రామ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sxJJDI
v
No comments:
Post a Comment