Monday, 19 April 2021

‘సలార్‌’లో శృతి హాసన్ రోల్ ఇదే.. నెట్టింట్లో వైరలవుతున్న వార్త.. ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశాడుగా..

కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కే.జీ.ఎఫ్’ చిత్రం యావత్ భారత సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. అసలు ఒక సినిమా ఈ రేంజ్‌లో తీయవచ్చా.. అనే స్థాయిలో కే.జీ.ఎఫ్ తొలి ఛాప్టర్‌ని రూపొందించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆ సినిమా సినిమా సీక్వెల్ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ పనుల్లో అతను బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2 టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ‘’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా నుంచి ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. దీన్ని ‘సలార్’ సినిమాతో చెరిపేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట అతను. అందుకోసం శృతి హాసన్‌కి ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను రాసుకున్నాడట. అంతేకాక.. ఆమెతో ఈ సినిమాలో భారీగా యాక్షన్ సీన్లు చిత్రీకరించాలనే ప్లాన్‌లో ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం. ఇక కే.జీ.ఎఫ్‌ను నిర్మించిన హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సలార్ కూడా రూపొందనుంది. రవి బాసుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం గురించి ఇప్పటికైతే ఎటువంటి సమాచారం లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dvoXAv
v

No comments:

Post a Comment