Wednesday, 28 April 2021

మొహానికి మొత్తం అలా.. ఫ్యామిలీమెన్ నుంచి అదిరిపోయే లీక్.. నెవ్వర్ బిఫోర్ అనేలా సమంత

అభిమానులు ఎప్పటినుంచి ఎదురుచూస్తోన్న ఓ విషయం తాజాగా బయటకు వచ్చేసింది. దేశాన్ని ఓ ఊపు ఊపేసిన ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి వెబ్ సిరీస్ సీజన్‌ 2లో సమంతకు అదిరిపోయే పాత్ర ఒకటి వచ్చింది. అలా సమంత ఆ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ పాటికే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని, బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని మేకర్స్ ప్రకటించారు. ఆ సమయంలో ప్రమోషన్స్ జోరు కూడాపెంచారు. టీజర్ కూడా విడుదల చేశారు. అందులో సమంత చివరి షాట్‌లో అలా మెరుస్తారు. ఆ ఒక్క షాట్‌తోనే సమంత పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు మళ్లీ సమంత పాత్రకు సంబంధించిన అప్డేట్ రానే లేదు. నేటి సమంత బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. దర్శకులు సమంతకు స్పెషల్ విషెస్ చెప్పారు. అందులో సమంత పాత్రకు సంబంధించిన లుక్‌ను లీక్ చేసేశారు. అంతే కాకుండా సమంత పాత్ర పేరు రాజి అని కూడా చెప్పేశారు. ఈ ఫోటోలో సమంతను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మొహం అంతా కూడా మసి పూసుకుని అంద విహీనంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే రాజీ సత్తా ఏంటో అందరికీ చూపించబోతోన్నామని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Radde4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...