Saturday, 10 April 2021

‘దేశం గురించి తెలియాలంటే ఒకరి ఇంటికి వెళ్లక్కర్లేదు.. రోడ్లే చెప్పేస్తాయి’.. సిద్ధార్త్ ‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదల

‘బాయ్స్’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మొదలగు సినిమాలతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సిద్ధార్త్ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. చాలాకాలంగా అతను సరైన హిట్‌ లేకుండా ఉన్నాడు. దీంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. త్వరలో సంగీత దర్శకుడి, హీరో జీవీ ప్రకాష్ కుమార్‌తో కలిసి బిచ్చగాడు వంటిటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘’ అనే సినిమాతో సిద్ధార్త్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్త్ ట్రాఫిక్ పోలీస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన టీజర్ కూడా ఆకర్షణియంగా ఉంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. ‘సిద్ధార్థ్, జీవి ప్రకాష్ కుమారులు నటించిన ఈ యాక్షన్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది.. ఇద్దరు హీరోలు పోటాపోటీగా సినిమా లో నటించారు. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. టీజర్ కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.. సిద్ధూ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల మధ్య కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాలో కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కి రమేష్ పి పిళ్లై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s92Gwl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...