Sunday, 4 April 2021

‘సర్కార్ వారి పాట’కు కరోనా దెబ్బ.. మహేష్ టీమ్ కీలక నిర్ణయం! తప్పని పరిస్థితుల్లో..

‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘గీతగోవిందం’ ఫేం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే అలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రభావం ఇప్పటికే పలు సినిమాలపై పడింది. బాలీవుడ్, టాలీవుడ్‌తో సహా దాదాపు అన్ని ఇండస్ట్రీల నటీనటులు కరోనా బారీన పడ్డారు. అందులో కొందరు చికిత్స తీసుకొని కోలుకోగా.. పలువురు ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా వైరస్ ప్రభావం పవరస్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రంపై పడింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారీన పడింది. ఈ విషయాన్ని నివేదా ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు కరోనా ప్రభావం 'సర్కారు వారి పాట'పై కూడా పడింది. ఈ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నెల 15న హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభించి.. ఓ 25 రోజులు ఇక్కడే షూటింగ్ ప్లాన్ చేశారట. ఆ తర్వాత ఓ పాటని గోవాలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించారట. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గోవా పర్యటనను చిత్ర యూనిట్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ నేపథ్యంలో షూటింగ్‌ని వాయిదా వేస్తారా.. లేక ఆ పాట చిత్రీకరణను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wpMM3U
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...