Thursday, 29 April 2021

ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. జాన్వీ కపూర్ లేటెస్ట్ పోస్ట్ వైరల్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె గురించి కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆ సినిమాతో ఊహించినంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అయితే సినిమాలతో పాటు.. జాన్వీ సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫోటోషూట్లు, హాలీడే పిక్స్‌తో కుర్రకారులో హీటెక్కిస్తు ఉంటుంది. లేటెస్ట్‌గా ఈ భామ హాలిడే ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు జాన్వీ.. ఒక రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తుందట. అది ఆమె సినిమా విడుదల తేదీనో.. మరో ముఖ్యమైన రోజో కాదు.. మే 1వ తేదీ కోసం. కరోనా వైరస్‌ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 17వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి దశలో కరోనా వారియర్స్‌కి ఈ వ్యాక్సిన్ అందించగా.. అప్పటి నుంచి దశలవారీగా ఈ వ్యాక్సినేషన్‌ని కొనసాగిస్తున్నారు. ఇక మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ భయకరంగా పెరిగిపోతుంది. ప్రతీ రోజు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్తున్న ప్రజలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక జాన్వీ కూడా ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటానా అని ఎదురుచూస్తుందట. మే 1వ తేదీ గురించి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు జాన్వీ పోస్ట్ చేసింది. అందుకు సంకేతంగా ఆమె రెండో ఫోటోలు కూడా షేర్ చేసింది. అంతేకాక.. ప్రతీ ఒక్కరు రిజిస్టర్ చేసుకొని.. వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. చివరిగా ‘గుంజన్ సక్సేనా’ అనే బయోపిక్‌తో ప్రేక్షకులను పలకరించిన జాన్వీ.. ప్రస్తుతం ‘రూహీ’, ‘దోస్తానా 2’ తదితర సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aMl1cG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...