Tuesday, 27 April 2021

Allu Arjun: పుష్పరాజ్ హవా మామూలుగా లేదే.. ఇలా అయితే రికార్డులు తిరగరాయడం ఖాయమే..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'పుష్ప రాజ్'గా జెట్ స్పీడులో దూసుకుపోతున్నారు. మాస్ లుక్‌లో ప్రేక్షకలోకాన్ని తెగ అట్రాక్ట్ చేస్తూ రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. అదేనండీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప' మూవీ విడుదలకు ముందే పలు రికార్డ్స్ చెరిపేసే దిశగా అడుగులేస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా.. రాజ్ రోల్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో దూసుకుపోతూ తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి టీజర్‌గా అల్లు అర్జున్ పుష్పరాజ్ వీడియో రికార్డు సృష్టించింది. అంతేగాక 1.2 మిల్లియన్ లైకులతో పాటు లక్ష కామెంట్స్ కూడా ఈ టీజర్‌కు రావడం గమనార్హం. టీజర్‌లో దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్ అన్నట్లుగా ఉంది. దీంతో బన్నీ స్పీడు చూసి ఇప్పుడే ఇలా ఉంటే ఇక 'పుష్ప' విడుదల తర్వాత గత రికార్డులు తిరగరాయడం ఖాయమే అంటున్నారు ఆడియన్స్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు సుకుమార్. చిత్రంలో అల్లు అర్జున్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. గిరిజన యువతిగా ఆమె అప్పీయరెన్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందని టాక్. అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటిస్తుండగా.. ఆయన చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోందని సమాచారం. ఈ మూవీపై బన్నీ ఫ్యాన్స్‌ మాటల్లో చెప్పలేని అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tVFNOH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...