Sunday, 18 April 2021

20 నిమిషాలు, రెండు గంటలు కాదు.. సహజంగా వచ్చిందా.. లేదా అనేదే ముఖ్యం: అదితి రావు

కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన పాత్రలు చేస్తూ.. అందరి ప్రశంసలు అందుకున్న నటి . హైదరాబాద్‌కి చెందిన ఈ బ్యూటీ.. ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ భామ తాజాగా నటించిన అంథాలజీ సిరీస్ ‘అజీబ్ దాస్తాన్స్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌లోని ‘గీలి పుక్కి’ అనే భాగంలో అదితి నటించింది. ఈ భాగానికి నీరజ్ గ్వావన్ దర్శకత్వం వహించగా.. కొంకణ సేన్ శర్మ, జ్ఞాన్ ప్రకాశ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉద్యోగాలకు వెళ్లే మహిళల జీవితాల్లో జరిగే కథ ప్రధాన అంశంగా గీలి పుక్కి సాగుతుంది. అయితే తన వెబ్‌సిరీస్‌కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషించానని అదితి తాజా మాట్లాడుతూ.. వెల్లడించింది. చేసే పాత్ర ముఖ్యం కానీ.. ఆ పాత్ర ఎంత సేపు తెరపై కనిపించింది అనే విషయాన్ని తాను పట్టించుకోను అని చెప్పింది. ‘‘పితృస్వామ్యం నుంచి మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే చిత్రం ఇది. తక్కువ నిడివి ఉన్న పాత్రల్లో నటించడం నాకు ఇబ్బంది ఏం కాదు. ఇరవై నిమిషాలు అయినా.. రెండు గంటల సినిమా అయినా నాకు రెండూ ఒకటే. మన పాత్ర సహజంగా వచ్చిందా.. లేదా.. అనేదే నాకు ముఖ్యం’’ అని అదితి తెలిపింది. అదితి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తోంది. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తాజా ‘మహాసముద్రం’ యూనిట్ .. ‘సోల్ ఆఫ్ మహాసముద్రం’ అంటూ సినిమా నుంచి అదితి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ageo2b
v

No comments:

Post a Comment